హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్రాష్ట్ర ఇన్చార్జిగా నియమితులైన బీఎం సందీప్ ఈనెల 22న ఆదివారం హైదరాబాద్ కు రానున్నారు. అదేరోజు ఉదయం గాంధీ భవన్ లో జరిగే రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం జరగనుంది. ఇందులో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, పీసీసీ చీఫ్మహేశ్గౌడ్ తో కలిసి పాల్గొంటారు. మధ్యాహ్నం పీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి బీఎం సందీప్ హాజరుకానున్నట్లు గాంధీభవన్‌వర్గాలు వెల్లడించాయి.
కాంగ్రెస్రాష్ట్ర ఇన్చార్జిగా నియమితులయ్యాక తొలిసారి వస్తున్న సందీప్‌కు ఘనస్వాగతం పలికేందుకు పీసీసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రెండు కీలక సమావేశాలకు ఆయన హాజరుకానుండడంతో పార్టీలో పెండింగ్పదవులపై చర్చ మొదలైంది. ప్రస్తుతం మూడు మంత్రి పదవులతోపాటు మూడు ఎమ్మెల్సీ పదవులు, నామినేటెడ్పోస్టుల భర్తీపై నిర్ణయం ఉంటుందని ఆశావహులు భావిస్తున్నారు.
